![]() |
![]() |

హాట్ అండ్ హ్యాపెనింగ్ యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏం కావాలో తెలుసా? 'ఎ లవ్ లైఫ్'. అదేనండీ... ఓ ప్రేమ జీవితం కావాలట. ఇది చెప్పింది ఎవరో కాదు... ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్. ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఫిల్టర్లు ఉంటాయి. సెలబ్రిటీలు సరదాగా ఒక్కోసారి ఫిల్టర్లు వాడుతున్నారు. అలాగే, రష్మీ గౌతమ్ మీద 'ఢీ'లో కో-యాంకర్ దీపిక ఓ ఫిల్టర్ ట్రై చేశారు.
'మీకు ఏం కావాలో ఈ ఫిల్టర్ చెబుతుంది' అని ఒక వాయిస్ వచ్చింది. ఆ తర్వాత రష్మీకి 'లవ్ లైఫ్' కావాలని చెప్పింది. ఒకసారి కాదు... రెండుసార్లు ప్రయత్నించినా అదే సమాధానం వచ్చింది. దాన్ని చూసి ఆశ్చర్యపోవడం రష్మీ వంతైంది. ఈ వీడియోను దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి 'నీ కోసం ఒకర్ని వెతుకుదాం' అని పేర్కొంది. అంతే కాదు... వీడియోలో ఇన్‌స్టా ఫిల్టర్ చెప్పింది నిజమే అన్నట్టు "కరెక్టే కదా రష్ (రష్మీ ముద్దుపేరు) అక్కా' అని ఎండింగ్ ఇచ్చింది.
రష్మీ వయసు నాలుగు పదులకు చేరుకుంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు కూడా! సుధీర్ వెంటపడుతున్నట్టు స్కిట్లు, షోస్‌లో ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. రియల్ లైఫ్‌లో ఒక్కటి అవుతారో, లేదో.. ఎవరికి వారు వేర్వేరు పార్ట్‌నర్స్‌ను చూసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.
.jpg)
![]() |
![]() |